నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించండి
కాకినాడ సిటీ: నూతన జాతీయ విద్యా విధానం వల్ల భారతదేశంలో విద్యావ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని, దాన్ని వ్యతిరేకించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు పి.జాన్సన్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ సూర్యకళామందిర్‌లో ఏఐఎస్‌ఎఫ్ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఏకై క విద్యార్ధి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అన్నారు. 89వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో ఘనంగా నిర్వహించామన్నారు. విద్యార్థులు రావడం ద్వారానే రాజకీయాల ప్రక్షాళన జరుగుతుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని, సెక్యులర్ స్వేచ్ఛ, సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని జాన్సన్‌బాబు అన్నారు. కేంద్రం 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించి ప్రాథమిక విద్యను కాపాడాలన్నారు. త్వరలో విజయనగరంలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డి.శ్రీనివాస్, ఏ నాగలక్ష్మి, రమేష్, సహాయ కార్యదర్శులుగా తంగెళ్ల అక్షయ్, దీప్తి, కోశాధికారిగా శ్రీరామ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment