మద్యం షాపులు దక్కించుకునే సమయంలో బెల్టు షాపులు, డోర్ డెలివరీలకు సిండికేట్ ప్రణాళికలు రూపొందించింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఒక్కో దుకాణం పరిధిలో కనీసం 100 బెల్ట్ షాపుల ఏర్పాటుకు సమాలోచనలు చేసింది. ఈ మేరకు షాపు నిర్వాహకులతో ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు. ఎవరు ఎక్కడ పెట్టుకోవాలి, ఒక్కో బెల్టు షాపు నిర్వహణకు ఎంత డిపాజిట్ చెల్లించాలి, అబ్కారీ శాఖకు ప్రతి నెలా ఎంత ముట్టజెప్పాలనే విషయాలపై సిండికేట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ వ్యాపారులు, బెల్టు దుకాణాల నిర్వాహకులకు దిశానిర్దేశం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment