ప్రజల్లో అవగాహన పెంచాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాల చేపడతామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాలో పారిశుధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా మహిళల, ప్రజల భాగస్వామ్యం చేసి మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సామర్థ్యం పెంచడం ద్వారా గ్రామ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రిల స్థాయిలో టాయిలెట్ నిర్వహణలో పోటీలు నిర్వహించాలన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి 10 వేల రూపాయల నగదు పురస్కారం అందించాలని సూచించారు. జిల్లాలో చురుకై న పాత్ర పోషిస్తున్న ఆరుగురు పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సత్కరించారు. గంజే వీరమ్మ, నల్లేపు సింహాచలం, పేరంపాలి వీరాస్వామి, ఏ బేబి, మేరీ, విజయలను జిల్లాలోని అన్ని విభాగాల్లో పారిశుద్య కార్మికుల సేవలకు గుర్తింపుగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రశాంతి
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో
పారిశుధ్య కార్మికులకు సన్మానం
Comments
Please login to add a commentAdd a comment