టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి నారాయణరావుకు మద్దతు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావుకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ప్రకటించింది. స్థానికంగా ఒక హోటల్లో జరిగిన జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు పీవీ రమణ ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోలా సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణారావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎం.కూర్మారావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దేవినేని రమణ, అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ముత్యాలరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment