పి.గన్నవరం: రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పి.గన్నవరానికి చెందిన బొరుసు చంద్రశేఖర్‌కు గురువారం గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె దంత వైద్య విద్యార్థిని. ఆమె ప్రస్తుతం పీజీ చేస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు చంద్రశేఖర్ తన కుమార్తెతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి శేఖర్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడాడు. తాను సీబీఐ నుంచి మాట్లాడుతున్నానని, మీ కుమార్తెను ఒక నేరంపై అరెస్టు చేశామని, ఆమె తమ అదుపులో ఉందని బెదిరించాడు. ఇది ఫేక్ కాల్ అని గ్రహించి అవతలి వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో వెంటనే కాల్ కట్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ నంబర్‌కు పోలీస్ గెటప్‌లో ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment