గోదావరి మధ్యలో వంతెనపై నిలిచిన రైలు
రాజమహేంద్రవరం సిటీ: హటియా నుంచి యశ్వంత్‌పూర్ (12835) వెళ్లే ఎక్స్‌ప్రెస్ బుధవారం గోదావరి మధ్యలో రోడ్ కమ్ రైల్వే వంతెనపై నిలిచిపోయింది. రైల్లో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నది మధ్యలో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనతో కేకలు వేశారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమై లోకో పైలట్‌తో మాట్లాడారు. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన తర్వాత రైలు నిలిచిపోయింది. అనంతరం లోకో పైలట్‌కు వచ్చిన ఆదేశాల మేరకు రైలును కొవ్వూరు వైపు తీసుకువెళ్లిపోయారు. ఈ విషయంపై రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సైదయ్యను వివరణ కోరగా రైలులో ప్రయాణిస్తున్న కొందరు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయిందన్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment