విజయవంతం చేయాలి
భారం పడుతోందిలా..
రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న ఓ వినియోగదారుడు నవంబర్ నెలలో సుమారు 120 యూనిట్ల విద్యుత్ వినియోగించాడనుకుంటే.. రూ.390కు పైగా బిల్లు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం వేస్తున్న సర్దుబాటు చార్జీలు కలిపితే అదనంగా రూ.141.6 భారం పడుతుంది. అంటే మొత్తం రూ.561.60 మేర బిల్లు చెల్లించాలన్నమాట.
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోనని, అవసరమైతే ఇంకా తగ్గిస్తానని సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత ప్రజల్ని దగా చేశారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రెండుసార్లు కరెంటు చార్జీల భారం మోపి, వినియోగదార్లకు షాక్ ఇచ్చారు. 2022–23 సంవత్సరంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సెక్రటరీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 2026 జనవరి నెల వరకూ ఈ వసూళ్లు కొనసాగించాలని పేర్కొంది. దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అదనపు వసూళ్లకు నాంది పలికింది. దీంతో ప్రస్తుతం వణికిస్తున్న చలికాలంలో సైతం వినియోగదార్లకు కరెంటు బిల్లులు సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పి, తమపై విద్యుత్ బిల్లుల భారాలు మోపడంపై ఇప్పటికే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదలైన అదనపు వసూళ్లు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే తప్పుడు ఆరోపణతో కూటమి సర్కార్ అదనపు వసూళ్లు చేస్తోంది. టారిఫ్, శ్లాబ్ రేట్లు, ఎవరెన్ని యూనిట్లు వినియోగించారనే విషయాలేవీ పరిగణనలోకి తీసుకోకుండానే బాదుడే బాదుడు అన్న చందంగా ముందుకెళుతున్నారు. వెరసి గతంలో వినియోగించిన విద్యుత్‌కు ప్రజలు ప్రస్తుతం అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రతి నెలా ఒక్కో యూనిట్‌కు సగటున 60 పైసల వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఈవిధంగా గత నెల నుంచే వసూళ్లు ప్రారంభించారు. వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ గృహాలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన పరిశ్రమలు, హెచ్‌టీ, గృహ అవసరాలకు వినియోగించే వారికి సర్దుబాటు చార్జీలు తప్పవనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబాన్ని నెట్టుకు రాలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పెరిగిన విద్యుత్ బిల్లులు చూసి గగ్గోలు పెడుతున్నారు. ‘బాబు’గారి పాలన ‘బాదుడే బాదుడు’ అన్నట్టుగా ఉందని దుయ్యబడుతున్నారు.
ప్రతి నెలా రూ.4 కోట్లు పైగా భారం
జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా 108.85 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల వాటా 7.76 మిలియన్ యూనిట్లు. దీనిని పక్కన పెడితే.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ప్రతి నెలా 101.09 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి గాను విద్యుత్ శాఖకు రూ.63.56 కోట్లు చెల్లిస్తున్నారు. ఇందులో వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ గృహాల కనెక్షన్లకు మినహాయింపు ఉంది, ఇది 30 శాతమని అంచనా. మిగిలిన 70 శాతం యూనిట్లకు అంటే 7 కోట్ల యూనిట్లకు సర్దుబాటు చార్జీలు వేశారు. దీని ప్రకారం ఒక్కో యూనిట్‌కు సగటున ప్రతి నెలా 60 పైసల చొప్పున వినియోగదారులపై ప్రతి నెలా అదనంగా సుమారు రూ.4.2 కోట్ల భారం పడుతోంది. అంటే ఏడాదికి రూ.50.4 కోట్ల మేర కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది. ఈ భారాన్ని 2026 జనవరి వరకూ భరించాల్సిందే.
విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్ సీపీ పోరుబాట
విద్యుత్ చార్జీలు పెంచేది లేదని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు అడ్డగోలుగా ప్రజలపై భారం మోపిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శుక్రవారం పోరుబాట చేపడుతున్నారు. ప్రభుత్వ మోసాన్ని ప్రజల ముందు ఎండగడుతూ.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లోని విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు.
ఫ వినియోగదార్లకు కరెంటు షాక్
ఫ జిల్లాపై ఏడాదికి
రూ.50.4 కోట్ల అదనపు భారం
ఫ సర్దుబాటు చార్జీల పేరిట వసూలు
ఫ ఎన్నికల హామీని
తుంగలో తొక్కిన కూటమి సర్కార్
ఫ విద్యుత్ చార్జీల పెంపుపై
నేడు వైఎస్సార్ సీపీ పోరుబాట
ఫ అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
ప్రభుత్వ సంస్థల కనెక్షన్లు – 10,607
ప్రైవేటువి – 7,66,821
మొత్తం –7,77,428
ప్రతి నెలా వినియోగం
108.85 మిలియన్ యూనిట్లు
ప్రతి నెలా బిల్లులు
రూ.74.41 కోట్లు
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం చేపడుతున్న పోరుబాట ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని రాజా నివాసంలో పోరుబాట పోస్టర్లను గురువారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వినియోగదార్లపై రూ.15 వేల కోట్లు పైగా భారం మోపారని దుయ్యబట్టారు. ఈ భారాలను నిరసిస్తూ తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ప్రజలను దగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. విద్యుత్ ఆందోళనలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలసి విద్యుత్ శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, అధికారులకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నేతలు నందెపు శ్రీనివాస్, అడపా అనిల్, మేడబోయిన సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సర్దు‘పోటు’ ఇలా..
వినియోగించిన చెల్లించాల్సిన చెల్లించాల్సిన
సంవత్సరం సంవత్సరం మొత్తం
/నెల /నెల (రూ.)
2022 ఏప్రిల్ 2024 నవంబర్,
డిసెంబర్ 1.1876
2022 మే 2025 జనవరి, ఫిబ్రవరి 1.1876
జూన్ మార్చి, ఏప్రిల్ 1.1876
జూలై 2025 ఫిబ్రవరి 0.1870
ఆగస్టు మార్చి 0.1870
సెప్టెంబర్ ఏప్రిల్ 0.1870
అక్టోబర్ మే 0.7882
నవంబర్ జూన్ 0.7882
2023 డిసెంబర్ జూలై 2025 0.7882
జనవరి ఆగస్టు, సెప్టెంబర్ 1.5534
ఫిబ్రవరి అక్టోబర్, నవంబర్ 1.5534
మార్చి 2025 డిసెంబర్, 2026
జనవరి 1.5534
కరెంటు చార్జీలు తగ్గించాలి
రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి ప్రజలు మద్దతు తెలపాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్‌లో పోరుబాట పోస్టర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల తరుణంలో కరెంట్ చార్జీలు పెంచడంతో ఇటు ప్రజలు, అటు వ్యాపారుల్లో సంతోషం లేకుండా పోయిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోనని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్ల రూపాయల మేర వినియోగదార్లను బాదుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా విద్యుత్ కార్యాలయానికి వెళ్లి, కరెంటు చార్జీలు తగ్గించాలంటూ వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. గృహ వినియోగదారులపై మోపిన రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడును తక్షణమే ఉపసంహరించాలని, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment