నేడు రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీలు
రంగంపేట: వడిశలేరు – రంగంపేట గ్రామాల మధ్య ఏడీబీ రోడ్డు పక్కనే గల పామాయిల్ తోటలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోటీ ఆర్గనైజర్లు బొప్పన బ్రహ్మాజీరావు, కూటి కోటేశ్వరరావు శనివారం మాట్లాడుతూ దివంగత ఆదర్శ రైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక ఎడ్లబళ్ల పరుగు పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సీనియర్, జూనియర్ విభాగాలలో 1600, 1000 మీటర్ల పోటీలలో సుమారు వంద జోడీల ఎద్దులు పాల్గొంటున్నాయన్నారు. వీటిలో విజేతలకు బుల్లెట్, ఎలక్ట్రిక్ బైక్‌లను బహుమతులుగా అందిస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పోటీలకు భారీగా పోటీదారులు హాజరవుతారని, ఇప్పటికే పలువురు పోటీ ప్రదేశానికి చేరుకున్నారని విరవించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment