నూజివీడు: మండలంలోని తుక్కులూరు వద్ద శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు కలెక్టర్ట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న గూడపల్లి సాయినాథ్(34) మృతిచెందాడు. పట్టణానికి చెందిన సాయినాథ్ కలెక్టరేట్లో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ ఆటోను కూడా ఢీకొనడంతో ఆటోను నడుపుతున్న తమ్మిశెట్టి రాంబాబుకు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి భార్య, తల్లి ఉన్నారు.
లారీని ఆపకుండా వెళ్తుండగా తుక్కులూరు గ్రామస్థులు వెంబడించి రూరల్ పోలీసులకు సమాచారమందించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన సాయినాథ్ ఇటీవల వరకు నూజివీడు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, ఆర్ఐగా విధులు నిర్వహించారు.
రూరల్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ పావులూరి శ్రీనివాసరావు అతిగా మద్యం సేవించి లారీని నడపడమే కారణమని డీఎస్పీ అశోక్‌కుమార్‌గౌడ్ తెలిపారు. డ్రైవర్‌ది పెదపాడు మండలం అప్పనవీడని, కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment