![శ్రీనివాసపురం సర్పంచ్ యడ్లపల్లి రాధికను అభినందిస్తున్న ఎంపీ శ్రీధర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/15/14jrg03-290011_mr_0.jpg.webp?itok=tJh6xkUU)
శ్రీనివాసపురం సర్పంచ్ యడ్లపల్లి రాధికను అభినందిస్తున్న ఎంపీ శ్రీధర్
జంగారెడ్డిగూడెం: జీలుగుమిల్లి మండలంలో నావెల్ బేస్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. సోమవారం జంగారెడ్డిగూడెం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిఫెన్స్ శాఖ వైజాగ్‌కు సంబంధించిన నావెల్‌బేస్ సరిపోవడం లేదని, బ్యాకప్‌గా మరో బేస్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంలో ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నావెల్ బృందాన్ని ఆహ్వానించి పరిశీలన చేయించామన్నారు. నావెల్ అధికారులు రెండు సార్లు ఇక్కడ పర్యటించి మన ప్రాంతాన్ని ఎంపిక చేశారన్నారు. త్వరలో నావెల్‌బేస్ ఇక్కడ ఏర్పాటుచేస్తారని, ప్రస్తుతం పేపర్ వర్క్ జరుగుతుందని చెప్పారు. ఇది భారీ ప్రాజెక్టు అని, దీనికి 1,300 ఎకరాలు అవసరం ఉందన్నారు. బేస్ ఏర్పడితే 1,000 మంది అధికారులు ఇక్కడ శాశ్వతంగా పనిచేస్తారన్నారు. నావెల్ శిక్షణ, కార్యకలాపాలు జరుగుతాయన్నారు. స్థిరకాలపు మంచి ప్రాజెక్టు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ముంపు గ్రామాల బాధితులకు మంచి అవకాశం అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించిందని, మహాత్ముల కలలను నిజం చేస్తున్నామన్నారు. నాలుగేళ్ల పాల నలో పేదరికాన్ని తగ్గించగలిగామని అన్నారు. ఆయన్ను శ్రీనివాసపురం సర్పంచ్‌గా ఏకగ్రీవమైన యడ్లపల్లి రాధిక మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎంపీ కోటగిరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment