![త్రీడీ ఫార్ములాతో విజయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08elr66-290072_mr-1739040712-0.jpg.webp?itok=Kuzopb_g)
త్రీడీ ఫార్ములాతో విజయం
ఏలూరు (టూటౌన్): సాధించాలనే కోరిక, సంకల్పం, క్రమశిక్షణలతో కూడిన త్రీడీ ఫార్ములా పా టిస్తే ఏ విద్యార్థి అయినా విజయం సాధిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వి.జయప్రకాష్ అన్నా రు. స్థానిక అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో ఏఎస్‌డబ్ల్యూ 10వ తరగతి విద్యార్థులకు శనివారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. పదో తరగతి పుస్తకాలను బాగా చదివినవారు పోటీ పరీ క్షల్లో సఫలమవుతారని, సాంఘిక సంక్షేమ జూనియర్, పాలిటెక్నిక్, ట్రిపుల్‌ఐటీ కళాశాలల్లో సీట్లు సాధిస్తారన్నారు. సాంఘిక సంక్షేమ కార్యాలయ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్, ఏఎస్‌డబ్ల్యూ బి.రమేష్ మాట్లాడుతూ ఉన్నత విద్యకు 10వ తరగతే తొలి మెట్టని అన్నారు. ఈఎంహెచ్‌సీ ఏలూరు–1, డబ్ల్యూహెచ్‌ఓ కొవ్వలి, కూచింపూడి, ఏలూరు బా లికల వసతి గృహ విద్యార్థులు, వార్డెన్ వి.విజయలక్ష్మి, మెంటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment