![నవోదయ ప్రవేశ పరీక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08elr05-290003_mr-1739040712-0.jpg.webp?itok=R_Rpv_iQ)
నవోదయ ప్రవేశ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన 9వ తరగతి పరీక్షలకు 1,007 మంది విద్యార్థులకుగా 302 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు రెండు కేంద్రాల్లో నిర్వహించిన 11వ తరగతి పరీక్షకు 653 మందికి 189 మంది హాజరయ్యారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ రెండు కేంద్రాల్లో, పెదవేగి జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఆరు కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment