కొనుగోలుదారునికి అందిజేస్తున్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు
ఏలూరు (టూటౌన్): హీరో మోటో కార్ఫ్ సంస్థ నుంచి తయారు చేయబడి ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడుపోయిన హీరో గ్లామర్ బైక్‌ను మళ్లీ సరికొత్త టెక్నాలజీతో తీసుకురావడం అభినందనీయమని ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక సాయి స్వర్ణ షోరూమ్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కొనుగోలుదారునికి గ్లామర్ బైక్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపటి కంటే సరికొత్తగా అన్ని వర్గాల వారికి నచ్చేలా బైక్ ఉందన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. షోరూమ్ జీఎం ఏవీ సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా హీరో గ్లామర్ బైక్ మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగిందన్నారు. షోరూమ్ సర్వీస్ మేనేజర్ పవన్ కుమార్, టీఎస్‌ఎం మహేష్, మెకానిక్‌ల అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment