సారా విక్రేత అరెస్ట్
పోలవరం రూరల్: పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట గ్రామంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు లీటర్ల నాటు సారా కలిగి ఉన్న కె.రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని సీఐ ఆర్ సత్యవతి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై జి.సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: పోక్సో కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన షేక్ షారూక్ ఖాన్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. సెప్టెంబర్ 30న మాయమాటలు చెప్పి బాలికను కడప తీసుకెళ్లి, ఒక ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు గతంలో పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీఐ కృష్ణబాబు షారుక్‌ఖాన్‌ను అరెస్టు చేశారని చెప్పారు.
ఫుడ్‌జోన్‌లో తనిఖీలు
ద్వారకాతిరుమల: రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి వి.శ్రీరాంబాబుకు వచ్చిన సమాచారం మేరకు మండలంలోని లక్ష్మీనగర్‌లో చాయ్ బిస్కెట్ ఫుడ్‌జోన్‌లో శుక్రవారం తనిఖీలు చేశారు. వాణిజ్య అవసరాలకు సబ్సి డీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. రూ.13,856 విలువైన, 5 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. రెస్టారెంట్ యజమాని బలే విజ్ఞేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ బి.కన్యాకుమారి, సివిల్ సప్‌లైస్ డీటీ (ద్వారకాతిరుమల) పి.కామేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒడిశా బృందం క్షేత్ర పర్యటన
కాళ్ల: ఒడిశా రాష్ట్రం మత్స్యశాఖ బృందం కాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం క్షేత్ర పర్యటన చేసింది. అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతులు పాటిస్తోన్న యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకుంది. సీసలి గ్రామంలో చేపలు, రొయ్యల చెరువుల సాగు తో పాటు కాళ్ల గ్రామంలో స్పాన్ హేచరీలను పరిశీలించింది. ఒడిశా రాష్ట్రంలో వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కువగా ఉన్నప్పటికీ అధిక దిగుబడులు రావడంలేదని, తమ రాష్ట్రంలోని మత్స్యసంపదను మరింత మెరుగుపరచుకొనేందుకు క్షేత్ర పర్యటనకు వచ్చినట్టు మత్స్యశాఖ బృందం తెలిపింది. సీసలి, చినకాపవరం మత్స్యశాఖ సహాయకులు సత్యనారాయణ, అహ్మద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment