సంతోషంగా ఉంది
పంచారామ క్షేత్రాల దర్శనంలో భాగంగా అమరావతి దర్శనం చేసుకుని భోజనం సమయానికి భీమవరం వచ్చాం. స్వామి వారి దర్శనం అనంతరం దేవస్థానం వద్దే ఏర్పాటు చేసిన భోజనం చేశాం. మాలాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామి వారిని ప్రసాదాన్ని భోజనం రూపంలో స్వీకరించడం సంతోషంగా ఉంది.
– జి.నిష్మా నల్గొండ
గొప్ప కార్యక్రమం
భీమవరం పంచారామ క్షేత్రంలో అన్న ప్రసాదం స్వీకరించాం. భోజనం నాణత బాగుంది. యాత్రికులకు దేవస్థానం ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమం. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం హోటళ్లకు వెళ్లే ఇబ్బందులు ఉండవు. ఉచితంగా భోజనం వల్ల ఖర్చు ఆదా అవుతుంది.
– టి.వెంకటరత్నం బాపట్ల
నాణ్యతగల భోజనం
కార్తీక మాసంలో పంచారామక్షేత్రానికి వచ్చే భక్తులకు ఈ ఏడాది దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నాం. కార్తీక మాసం ఆది, సోమవారాల్లో రోజుకు 15 వేల మంది, మిగిలిన రోజుల్లో మూడు వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. మధ్యలో దాతలు కూడా ఒక రోజు అన్నదానం చేస్తున్నారు. యాత్రికులకు నాణ్యత గల భోజనం అందిస్తున్నాం. – డి.రామకృష్ణంరాజు, ఈఓ, పంచారామక్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment