మెషీన్ లెర్నింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్‌తో అవకాశాలు
భీమవరం: మెషీన్ లెర్నింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల సమన్వయంతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని రాధను టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ వీఎల్‌ఎన్ శాస్త్రి అన్నారు. భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇంటిగ్రేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్ వర్కుషాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డేటా మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని, ఈ సాంకేతికతను అనుసంధానించడం ద్వారా ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ మెరుగైన ప్రదర్శన, సమగ్ర ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో సవాళ్లను అధిగమించవచ్చని శాస్త్రి తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండు రంగరాజు మాట్లాడుతూ ఇంటిగ్రేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్ – డేటా బేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అప్లికేషనన్స్ అనేది విద్యుత్ వ్యవస్థల పనితీరును మెరుగునకు ఉపయోగపడుతుందని వివరించారు. ప్రిన్సిపాల్ ఎం అంజన్ కుమార్, ఈఈఈ డిపార్ట్‌మెంట్ హెడ్ కేబీవీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రేషన్ బియ్యం వ్యాన్ సీజ్
భీమడోలు: అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యా న్ని జాతీయ రహదారిపై భీమడోలు రైల్వే గేటు వద్ద గురువారం రాత్రి విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి.శివరామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన జన్వావుల సుధాకర్ అనే వ్యక్తి ఏలూరు పరిసర గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని ఉండ్రాజవరానికి చెందిన బాషా అనే వ్యక్తికి అధిక ధరకు అమ్ముతున్నాడు. ఈ బియ్యాన్ని వ్యాన్‌లో డ్రైవర్ బీటీఎస్ మణికంఠ ఉండ్రాజవరం తరలిస్తుండగా భీమడోలు వద్ద పట్టుకున్నారు. రూ.1.60 లక్షల విలువగల 40 క్వింటాళ్ల బియ్యం, రూ.9 లక్షల విలువ గల వాహనాన్ని సీజ్ చేశారు. వ్యాన్ డ్రైవర్ మణికంఠ, జన్వావుల సుధాకర్, బాషాలపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భీమడోలు సీఎస్‌డీటీ జి.భరత్‌కుమార్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment