స్వర్ణవారిగూడెంలో భూ‘మాయ’పై విచారణ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ భూ సేకరణలో భాగంగా గిరిజన నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వగా, జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం రెవెన్యూ లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూము లు కాజేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెల నాలుగో తేదీన స్వర్ణవారిగూడెంలో భూ ‘మాయ’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించి కలెక్టర్ వెట్రిసెల్వి విచారణకు ఆదేశించారు. జీలుగుమిల్లి తహసీల్దార్ సందీప్‌ను విధుల నుంచి తొలగించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవజోజికి పూర్తి అదన పు బాధ్యతలు అప్పగించారు. గతేడాది నవంబర్ 20న 31/1,31/2 సర్వే నెంబర్లలోని 4.62 ఎకరాల భూమిని మిగులు భూమిగా రెవెన్యూ అధికారులు చూపించారు. అయితే నకిలీ హక్కు పత్రంతో మడకం ఏసోబు అనే గిరిజనుడి పేరుతో ఓ గిరిజనేతరుడు సాగు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. వాస్తవానికి ఏసోబు పేరున వేలేరుపాడు మండలం తాట్కూరు గొమ్ము రెవెన్యూలో సెంటు భూమి కూడా లేదని తేలింది. ఏసోబు తండ్రి రాజులుకు తాట్కూరుగొమ్ము రెవెన్యూలో 2.43 ఎకరాల భూమి ఉండగా, ఈ భూమికి ల్యాండ్ టు ల్యాండ్ కింద బుట్టాయిగూడెం మండలం బొద్దులవారిగూడెంలో 2.43 ఎకరాల భూ మి అప్పగించారు. అంటే అవార్డులో లేని ఏసోబుకు నకిలీ హక్కు పత్రంతో వీఆర్వో, వీఆర్‌ఏ, రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క భూమిని కట్టబెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్ రామనాధం సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. దీంతో 4.62 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల ని కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణవారిగూడెంలో 43.33 ఎకరాల మిగులు భూమి ఉండగా, గత నెలలో 8 ఎకరాలే చూపించిన జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారులు విచారణలో 16.48 ఎకరాలు చూపిస్తున్నా రు. ఈ భూములు ప్రస్తుతం ఆక్రమణల్లోనే ఉన్నా యి. వీటిలో గిరిజనేతర రైతులు సాగుచేసుకుంటున్నారు. నకిలీ హక్కు పత్రాలతో ఎంత మంది భూ ములు ఆక్రమించుకున్నారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వేలేరుపాడు మండల నిర్వాసితుల అవార్డు కాపీలు, పహణీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
జీలుగుమిల్లి తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగింపు
బయట పడిన నకిలీ హక్కు పత్రాల భాగోతం
Comments
Please login to add a commentAdd a comment