చాట్రాయి : ఓ యువతి ఇంటి ముందు హల్‌చల్ చేసిన తెలంగాణ కానిస్టేబుల్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వేంసూరు మండలం లచ్చన్నగూడెంనకు చెందిన పూరేటి నాగరాజు హైదరాబాద్ సచివాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నరసింహారావుపాలెంకు చెందిన ఓ యువతితో అతడికి కొద్దికాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అతడిని గతంలో మందలించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యువతి ఇంటికి వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని తీసుకెళ్తుండగా యువతి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. దీంతో నాగరాజు కత్తితో వారిని బెదిరించగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి నాగరాజుని స్టేషన్‌కి తరలించారు. కాగా నాగరాజుకి భార్య, పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment