కై కలూరు: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ఉప్పుటేరు పరివాహక ఆక్రమణ చెరువుల తొలగింపు చర్యలను చేపట్టాలని డెప్యూటీ స్వీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కలెక్టర్ వెట్రిసెల్విని కోరారు. కై కలూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం జిల్లా, నియోజకవర్గ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఉప్పుటేరు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ తాగునీటి సమస్యలపై కైకలూరు నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాగునీటి సరఫరా పథకాలలో ఫిల్టర్‌బెడ్లు మార్పు, మైక్రో ఫిల్టర్‌ల ఏర్పాటు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటపాక పక్షుల విహార కేంద్రం అభివృద్ధికి రూ.కోటి నిధులు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment