‘స్వచ్ఛ ఆంధ్ర’కు ప్రత్యేక కార్యాచరణ
వివాహిత మృతి
బంధువులను పరామర్శించడానికి వెళ్తున్న వివాహిత రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శివదేవుని చిక్కాలలో చోటుచేసుకుంది. IIలో u
ఏలూరు(మెట్రో): స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్ కింద రానున్న వంద రోజుల్లో అత్యంత పరిశుభ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె మాట్లాడుతూ శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించాలన్నారు. శనివారం ఏలూరు పాత బస్టాండ్ ప్రాంతంలో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రమదానం, మానవహారం, ప్రతిజ్ఞ, పరిసరాలను పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, కమిషనర్ ఎ.భానుప్రతాప్, డీపీఓ కె.అనురాధ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి : జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అధికారులంతా అంకితభావంతో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రత్యేక దృష్టి : జిల్లాలో ఉద్యాన పంటలు విస్తరణ, ఆక్వా రంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర– 2047 విజన్ ప్రణాళికలో భాగంగా లక్ష్యాలను సాధించాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌కే హబీబ్ బాషా, ఏపీఎంఐపీ పీడీ పీవీఎస్ రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్‌వీ నాగలింగాచార్యులు, పశు సంవర్ధక శాఖ ఇన్‌చార్జ్ జేడీ టి.గోవిందరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment