నేడు ‘నవోదయ’ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు ‘నవోదయ’ పరీక్ష

Published Sat, Jan 18 2025 2:27 AM | Last Updated on Sat, Jan 18 2025 2:27 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు పరీక్షను శనివారం నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఉదయం 10 గంటలకు విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నవోదయ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకుని తీసుకురావాలన్నారు. బ్లాక్‌ లేదా బ్లూ పెన్‌తో మాత్రమే జవాబులు బబుల్‌ చేయాలని, కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదన్నారు. వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్లు 63030 39477, 94907 287768, 96406 76608, 90785 68664, 80748 33690, 94917 31486లో సంప్రదించాలని కోరారు.

పోలీసుల అదుపులో కిడ్నాపర్లు

భీమవరం: భీమవరంలో గురువారం ఆక్వా వ్యాపారి వి.సత్యనారాయణను కిడ్నాప్‌ చేసిన వ్యక్తులను అనంతపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సత్యనారాయణను బలవంతంగా తీసుకువెళ్లారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్‌ సీఐ జి.కాళీచరణ్‌ సీసీ పుటేజీల ద్వారా కిడ్నాప్‌ చేసిన కారు వెళ్లిన మార్గాలను పరిశీలిస్తూ అనంతపురం పోలీసులను అప్రమత్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement