ఘనంగా ఓటర్ల దినోత్సవం
ఏలూరు(మెట్రో): 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఇండోర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఓటరుగా నమోదు కావడం ప్రతిఒక్కరికి గర్వకారణమని, ఓటువేసే వ్యక్తి ప్రజాస్వామ్యానికి శక్తి అనే నినాదాలతో విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. అనంతరం ర్యాలీ కలెక్టరేట్‌కు చేరింది. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్ట ర్ దేవకిదేవి, ఆర్డీఓ అచ్యుత అంబరీష్ పాల్గొన్నారు.
రేపు నిధి ఆప్ కే నికత్
రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి నిధి ఆప్ కే నికత్–జిల్లా ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఏలూరులోని శనివారపుపేట పీఏసీఎస్‌లో శిబిరం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment