ఏడాదిపాటు ఆలపాటి శతజయంత్యుత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తమ తండ్రి ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 25వ తేదీ నుంచి ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాప్రియలు, సాహితీవేత్త అంబికా సంస్థల సృష్టికర్త ఆలపాటి రామచంద్రరావు 100వ జయంతి కార్యక్రమం స్థానిక పవర్‌పేటలోని అంబికా భవన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆలపాటి రామచంద్రరావు శత జయంతిని పురస్కరించుకుని కళాకారులను సత్కరించడంతోపాటు వివిధ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కళారత్న కేవీ సత్యనారాయణతో చర్చించామని, త్వరలో ఈ కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తామని అంబికా బ్రదర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ, అంబికా ప్రసాద్, అంబికా రాజాలకు కళారత్న కేవీ సత్యనారాయణ అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రముఖ మేకప్ కళాకారుడు, నాటక దర్శకుడు ఎంవీ సోమేశ్వరావును అంబికా సోదరులు ఆలపాటి రామచంద్రరావు కళాపీఠం రంగస్థల అవార్డుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్నేహం సంస్థ సభ్యుడు మైలవరపు నరసింహం, వైఎంహెచ్‌ఏ సభ్యులు, సాహిత్య మండలి సభ్యులు, పలువురు ప్రముఖులు, అంబికా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
ఆలపాటి రామచంద్రరావుకు నివాళులు
ఏలూరు టౌన్: ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా సంస్థల అధినేత ఆలపాటి రామచంద్రరావు ఏలూరు నగరానికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి తీసుకువచ్చారని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. ఆలపాటి రామచంద్రరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, నగర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మద్దాల ఫణి, పార్టీ ముఖ్యనాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment