జరిమానాలు కాదు.. ప్రజల్లో పరివర్తన రావాలి
కై కలూరు: హెల్మెట్ ధారణ విషయంలో వాహనదారులపై జరిమానాలు విధించడం కాకుండా ముందుగా వారిలో పరివర్తన తీసుకురావాలని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేనితో కలిసి కై కలూరు సీఎన్నార్ గార్డెన్ నుంచి ట్రావెలర్స్ బంగ్లా వరకు హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. ట్రావెలర్స్ బంగ్లాలో కొల్లేరు ప్రజలకు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గతంలో రూ.100 జరిమానాను కేంద్రం రూ.1000కి పెంచిందన్నారు. ఎస్పీ కిషోర్ మాట్లాడుతూ రూ.1000 జరిమానా కంటే రూ.700తో హెల్మెట్ కొనుగోలు చేయడం ఉత్తమమన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ వినియోగించాలన్నారు. దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం డీఐజీ, ఎస్పీలు కై కలూరు పోలీసు క్వాటర్స్‌లో వివేకానంద విగ్రహం వద్ద మొక్కలు నాటారు. వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment