‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో నమోదు చేయాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ‘ఈ–శ్రమ్’ పోర్టల్ నందు మార్చి 31వ తేదీ లోగా నమోదు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 5 లక్షలకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారికి సామజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు ‘ఈ–శ్రమ్’ పోర్టల్ నందు నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న అసంఘటిత కార్మికులందరూ అర్హులన్నారు. ‘ఈ–శ్రమ్’ పోర్టల్ నందు నమోదైన ప్రతి కార్మికుడికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా ఉచితమని తెలిపారు. సమీపంలోని గ్రామ/ వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, లేదా మొబైల్ నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈశ్రమ్ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్‌సైటు లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
Comments
Please login to add a commentAdd a comment