అబ్బురపరుస్తున్న అరటి గెల
పాలకొల్లు అర్బన్: అరటిచెట్టు చివరిలో గెల వేసి కాయలు కాయడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే అరటిచెట్టు కాండం మొదట్లో అరటిపండ్ల గెలవేయడం చాలా అరుదు. పాలకొల్లు పట్టణానికి చెందిన కంచర్ల రాజేష్‌కి నరసాపురం మండలం చిట్టవరంలో అరటితోట ఉంది. ఆ తోటలో అరటిచెట్టు కాండం మొదట్లో అరటిగెల వేసి అందర్నీ అబ్బురపరుస్తోంది. చుట్టుపక్కల రైతులు, స్థానికులు చూసి అబ్బురపడుతున్నారు.
పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల : శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంతో పాటు, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు వేలాది మంది భక్తులతో కళకళలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment