![గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లొస్తూ ప్రమాదం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05jrgbut04ff-290039_mr-1738787794-0.jpg.webp?itok=j3_we3mF)
గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లొస్తూ ప్రమాదం
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మతల్లి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక కారు కనకదుర్గమ్మ గుడి సమీపంలోని మలుపు లోయలో తిరగబడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన ఆరుగురు భక్తులు బుధవారం కారులో గుబ్బల మంగమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరి వెళ్తున్న సమయంలో కామవరం సమీపంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి మలుపులోయలో కారు దూసుకుపోయి తిరగబడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిని వెనుక వాహనాదారులు సురక్షితంగా బయటకు రావడానికి సహకరించారు. సమాచారం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని లోయలో పడిన వాహనాన్ని ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది.
మలుపులో కారు బోల్తా
Comments
Please login to add a commentAdd a comment