చిల్ట్రన్ హోమ్‌కు చేరిన చిన్నారులు
జంగారెడ్డిగూడెం: తల్లి, ఆమె ప్రియుడు దాడిలో గాయపడిన చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఐసీడీఎస్ పీడీ పి.శారద అన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ఉదయ్‌రాహుల్, రేణుకలను జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణితో కలిసి ఆమె పరామర్శించారు. చిన్నారులను జంగారెడ్డిగూడెం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి ఏలూరు చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు. సీడబ్ల్యూసీ ముందు చిన్నారులను ప్రవేశపెట్టి వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్డీవో ఎంవీ రమణ, ఎస్సై షేక్ జబీర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఐసీడీఎస్ సీడీపీవో పి.బ్యూల, సూపర్‌వైజర్ కె.లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్ లీల తదితరులు పాల్గొన్నారు. కాగా చిన్నారులను ఏలూరు ఛైల్డ్‌హోమ్‌కు తరలించే సమయంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment