నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వద్ద మంగళవారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఏలూరు డీఎస్‌ఓ సత్యనారాయణరాజు, నూజివీడు సివిల్ సప్లయిస్ డీటీ జి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి మిట్టగూడెం వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వ్యాన్‌ను తనిఖీ చేసే సమయంలో రేషన్ బియాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఆ బియాన్ని అన్నవరం రైస్‌మిల్లులో భద్రపరచి, వాహనాన్ని రూరల్ పోలీస్‌స్టేషన్లో అప్పగించారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎం.కృష్ణ శివదీప్, పెద్దిరెడ్డి రామచంద్రరావు, చప్పిడి వెంకట కృష్ణలపై 6(ఏ), 7(1) కేసులను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment