కావలసినవి: తాజా పండ్ల ముక్కలు – కప్పు (అరటి, మామిడి లేదా బెర్రీలు); వీట్ గ్రాస్ పోడర్– టేబుల్ స్పూన్; పాలకూర– కప్పు; బాదం పాలు లేదా పండ్ల రసం – కప్పు; తేనె – టేబుల్ స్పూన్.
తయారీ: పండ్ల ముక్కలు, పాలు, వీట్ గ్రాస్ పోడర్, పాలకూర, తేనె అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేస్తే వీట గ్రాస్ స్మూతీ రెడీ. పిల్లలు బాగా ఇష్టపడతారు.
పోషకాలు:
విటమిన్ ఏ, సీ, కే, ఈ...లతోపాటు ఫోలేట్, పోటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. సుమారుగా 250 కేలరీలు, ప్రోటీన్ 4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 50 గ్రాములు, ఫైబర్– 6 గ్రాములు, చక్కెరలు– 35 గ్రాములు, ఫ్యాట్– 3 గ్రాములు.
ప్రయోజనాలు: ఈ స్మూతీలో ఆల్మలైన్‌ప్రోపర్టీస్ ఎక్కువ. ఇవి దేహంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్తాన్ని, కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. వ్యాధి నిరోధక శక్తి వృద్ధి అవుతుంది. ఇందులో ఉపయోగించే పాలకూర వంటివి సేంద్రియ ఎరువులతో పండినవైతే మంచిది. రసాయన ఎరువులతో పండిన ఆకులు ఉపయోగించేటట్లయితే ఆకులను ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment