రేపు బలసాని కిరణ్‌కుమార్‌ నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

రేపు బలసాని కిరణ్‌కుమార్‌ నామినేషన్‌

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

గుంటూరురూరల్‌: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్‌ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు.

నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు

వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు.

ఏలూరి కో–ఆపరేటివ్‌

బ్యాంక్‌ శాఖ ప్రారంభం

తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్‌లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్‌ సొసైటీ, తెనాలి చైర్మన్‌ డి.ఎల్‌. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్‌ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్‌ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్‌, బ్యాంక్‌ డైరెక్టర్‌ దత్త వెంకట కిరణ్‌ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్‌ను ప్రారంభించినట్టు చైర్మన్‌ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్‌, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్‌, చీఫ్‌ మేనేజరు ఎం.వి.ఆర్‌ శేషుకుమార్‌, రవిమోహన్‌ పాల్గొన్నారు.

ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత

గుంటూరు ఎడ్యుకేషన్‌: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు.

11వ అదనపు

జిల్లా జడ్జిగా శ్రీనివాస్‌

తెనాలిరూరల్‌: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీధర్‌, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి షరీఫ్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజశేఖర్‌, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీ సీత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్‌ అసోసియేషన్‌ కమిటీని పరిచయం చేశారు.

1/2

2/2

Advertisement
Advertisement