విశ్రాంత ఉద్యోగుల కాలపరిమితిని తగ్గించాలి
గుంటూరు మెడికల్: విశ్రాంత ఉద్యోగుల కమిషన్ చెల్లింపు కాల పరిధిని 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పింఛన్‌దారుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పి.కేశవరెడ్డి అన్నారు. గురువారం గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని అసోసియేషన్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ దారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే కమ్యూటేషన్ కాల పరిమితిని తిరిగి చెల్లించే పరిధిని తగ్గించాలని కోరారు. పంజాబ్ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, హర్యానాలో 12 సంవత్సరాలు, గుజరాత్ లో 13 సంవత్సరాలకు కాల పరిమితి తగ్గించారన్నారు. అదే తరహాలో ఏపీలో కమ్యూటేషన్ కాల పరిధిని 10 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశ్రాంత ఉద్యోగుల పట్ల తక్షణమే స్పందించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ బిల్స్ వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మౌలాలి, జిల్లా కోశాధికారి సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు రామా రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్, జోజప్ప పాల్గొన్నారు.
పింఛన్‌దారుల సంక్షేమ సంఘం
గుంటూరు జిల్లా అధ్యక్షులు పి.కేశవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment