వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచిన ఎన్డీఏ సర్కారు
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని, అలాంటి వలంటీర్లను ఎన్డీఏ సర్కారు నమ్మించి నట్టేట ముంచడం అమానవీయం, కుట్రపూరితమని సోషల్ యాక్టివిస్టు, రచయిత ఈదర గోపీచంద్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 23 నాటికే ఉనికిలో లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి జంకు లేకుండా అబద్ధాలు వల్లెవేయడం సిగ్గుచేటు అన్నారు. మరి మొన్నటి బడ్జెట్ ప్రకారం ఏప్రిల్, మే నెలల జీతాలు ఎలా ఇచ్చారని, బుడమేరు వరద బాధితుల సేవలకు చివరి నిమిషంలో వలంటీర్లను వాడుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.పదివేలకు పెంచి వారిని కొనసాగిస్తానని చంద్రబాబు ప్రకటించి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. రెండున్నర లక్షల మందికిపైగా వలంటీర్లకు అన్యాయం చేయడం తగదని పేర్కొన్నారు. వలంటీర్లు ఈ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.
సోషల్ యాక్టివిస్టు,
రచయిత ఈదర గోపీచంద్
Comments
Please login to add a commentAdd a comment