
20 నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రీడా పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21వ తేదీల్లో ‘ఆదర్శ్ 2024‘ పేరుతో రాష్ట్ర స్థాయి అంతర్ ఇంజినీరింగ్ కళాశాలల క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి తెలిపారు. బుధవారం కళాశాలలో క్రీడా పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగిన క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు వేదిక అన్నారు. 20న క్రీడా పోటీలను రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక విభాగ చైర్‌పర్సన్ పోడపాటి తేజస్విని ప్రారంభించనుండగా, 21న జరిగే బహుమతి ప్రధానోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి. ఐజక్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, క్రీడోత్సవాల సమన్వయకర్త డాక్టర్ కేవీఎస్ దుర్గాప్రసాద్, సాంస్కృతిక విభాగాల సమన్వయకర్త కొల్లా సుస్మిత చౌదరి, కృష్ణార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్ క్రోసూరు రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment