నరసరావుపేట: ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, విమర్శకుడు, అరసం జాతీయనేత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడం పల్నాడు జిల్లా సాహితీ లోకానికి గర్వకారణమని అశ్లీలతా ప్రతిఘటనా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుగొండ బహుముఖ ప్రజ్ఞాశాలి. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో చురుకై న కార్యకర్తని కొనియాడారు. 1989లో అశ్లీలతా ప్రతిఘటన వేదిక ఏర్పాటు, 1995 ప్రాంతంలో అప్పటి అశ్లీల నవలా రచయితలపై కోర్టులో కేసు వేసి నోటీసులు జారీచేసి వారిని కాళ్ళబేరానికి రప్పించి అశ్లీల నవలలు రాయబోమని లిఖితపూర్వక హామీలు ఇప్పించుటలోనూ, విరసం రుక్మిణితోపాటు పెనుగొండ కీలక పాత్ర పోషించారని గోపీచంద్ తెలిపారు. అశ్లీల డాన్సులను ప్రతిఘటించటంలోనూ, గ్రంథాలయాల నుంచి ఏడు అశ్లీల నవలలను నిషేధింపజేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో తాను వెలువరించిన ‘కామోత్సవ దహనం‘ పుస్తకాన్ని కొత్తపల్లి రవిబాబుతో పాటు పెనుగొండ సహ సంపాదకత్వం వహించారని గోపీచంద్ గుర్తు చేశారు. శ్రీ శ్రీ సాహిత్యం అంటే వీరాభిమాని అయిన పెనుగొండను ప్రధాన ఉపన్యాసకునిగా పిలిపించి నాటి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సత్కరించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment