ముగిసిన క్రీడా పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ వేదికగా జిల్లాలోని విద్యార్థినులకు రెండు రోజులపాటు జరిగిన జిల్లాస్థాయి 27వ బాలికల స్పోర్ట్స్–గేమ్స్ మీట్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సత్తా చాటిన గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ చాపియన్‌షిప్ సాధించింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.ఉషారాణి మాట్లాడుతూ... క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణతో విద్యార్థినులు రాణించారని అన్నారు. తమ కళాశాలకు ఓవరాల్ చాంపియన్‌షిప్‌తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ చాంపియన్‌షిప్ దక్కిందని వివరించారు. వ్యక్తిగత విభాగంలో ఈసీఈ విద్యార్థిని కె. నవ్య విజేతగా నిలిచినట్లు తెలిపారు. అదే విధంగా వివిధ విభాగాల వారీగా ఖో–ఖోలో గుంటూరు మహిళా పాలిటెక్నిక్, వాలీబాల్‌లో సెయింట్ మేరీస్, బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సాయి తిరుమల, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సెయింట్ మేరీస్, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో హిందూ కళాశాల, టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు విన్నర్లుగా నిలవడంతోపాటు అథ్లెటిక్స్‌లో బహుమతులు గెలుచుకున్నారని చెప్పారు. దీంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లోని సిబ్బందికి నిర్వహించిన టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీల్లో పొన్నూరు, గుంటూరు కళాశాలలు విన్నర్స్, రన్నర్లుగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment