తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు
అద్దంకి రూరల్: ఉదయం తప్పిపోయిన బాలుడిని సాయంత్రానికి అద్దంకి పోలీసులు వెతికి పట్టుకొచ్చిన సంఘటన గురువారం అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల మేరకు .. అద్దంకి పట్టణానికి గొట్టిపాటి శ్రీధర్ కుమారుడు గొట్టిపాటి ఓంకార్ స్థానిక బెల్ అండ్‌బెన్నెట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం పాఠశాలకు సైకిల్‌పై వెళ్లిన ఓంకార్.. స్కూల్‌కు వెళ్లే దారిలో సైకిల్, పుస్తకాల బ్యాగ్ పడవేసి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు తప్పిపోయాడా లేక కిడ్నాప్‌కు గురయ్యాడా అని భయాందోళనతో సీఐకి సమాచారం ఇవ్వడంతో సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్ బాషాల ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి అద్దంకి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆ బాలుడు సాయంత్రం ఒంగోలు బస్టాండ్‌లో కనబడటంతో తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎలా వెళ్లావని బాలుడిని అడగ్గా తాను ఒక్కడినే అద్దంకి బస్టాండ్ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సు ఎక్కి ఒంగోలు బస్టాండ్‌లో దిగినట్లు తెలిపాడు. బాలుడిని వెతకటంలో విశేష ప్రతిభకనబర్చిన సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్‌బాషాలను, పోలీస్ బృందాన్ని డీఎస్పీ మొయిన్ అభినందించారు.
సాయంత్రానికే గుర్తించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment