హోరాహోరీగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
గురజాల/గురజాల రూరల్ : పట్టణంలోనిపాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో భాగంగా గురవారం ఆరు పళ్ల జతలు పోటీలు పోటాపోటీగా సాగాయి. ఈ పోటీలను వైద్యుడు చల్లగుండ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమల్లాయిపాలెంకు చెందిన సిద్దంశెట్టి సామ్రాజ్యం ఎద్దుల జత 5201.3 అడుగుల దూరం లాగి ప్రథమస్థానం, కృష్ణాజిల్లా వెదుళ్లపల్లికి చెందిన వల్లభనేని మోహన్‌రావు, గుంటూరు జిల్లా మేడికొండురు మండలం పాలడుగుకు చెందిన వెదుళ్లపల్లి శ్రీనివాసరావు, శాఖమూరి విజయ పవన్ కుమార్ ఎడ్ల జతలు 5,000 అడుగుల దూరం లాగి రెండో స్థానం, గుంటూరు జిల్లా తూళ్లురుకు చెందన మోదుగుల రామిరెడ్డి, గుంటూరు జిల్లా కోల్లిపరకు చెందిన గుదిబండ మాధవ రెడ్డి ఎడ్ల జత 4,600 అడుగుల దూరం లాగి మూడో స్థానం సాధించాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన ఎడ్ల జత 4,324 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన లింగా ధరణీచౌదరి ఎడ్ల జత 4,256 అడుగులు లాగి ఐదో స్థానం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన కె.హుస్సేన్ ఎడ్ల జత 4,077 అడుగుల దూరం లాగి ఆరోస్థానం, పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన మేకా అంజిరెడ్డి ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి ఏడో స్థానం కై వసం చేసుకున్నట్టు కమిటీ నిర్వహకులు తెలిపారు. శుక్రవారం నాలుగు పళ్ల జతల పోటీలు నిర్వహిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment