భట్టిప్రోలు: ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు నాణ్యమైనవి విక్రయించకుంటే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శనరాజు (సీడ్స్) హెచ్చరించారు. భట్టిప్రోలులోని పలు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలలో గురువారం విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాలలో తనిఖీలు నిర్వహించి బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, ఎరువులు, పురుగు మందు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో భట్టిప్రోలు ఏవో జి.మీరయ్యతోపాటు బాపట్ల వ్యవసాయశాఖ కార్యాలయం టెక్నికల్ ఏఓ ఎ.తిరుమలరావు, తూర్పు గోదావరి జిల్లా నల్లచర్ల ఏఓ కమలరాజు పాల్గొన్నారు.
రేపల్లె రూరల్: రైతులకు నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులను మాత్రమే విక్రయించాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ ఏడీఏ కేఐ సుదర్శనరాజు చెప్పారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను గురువారం వ్యవసాయశాఖల అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. సుదర్శనరాజు మాట్లాడుతూ రైతులకు అందించే వస్తువులతో పాటు రశీదులను తప్పనిసరిగా అందించాలన్నారు. ఎంఆర్‌పీ కన్నా అధికంగా విక్రయాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం ముందు స్టాక్ బోర్డు, ధరల బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. దుకాణాలలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రేపల్లె ఏడీఏ ఆర్.విజయ్‌బాబు, బాపట్ల వ్యవసాయ కార్యాలయం డీఏవో ఏ.తిరుమలరావు, నల్లజర్ల ఏవో కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
స్టాక్ నిల్వలు సక్రమంగా ఉండాలి
కర్లపాలెం: ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ సక్రమంగా ఉండాలని ఎరువుల తనిఖీ స్క్వాడ్ ఏడీఏ సుదర్శనరాజు పేర్కొన్నారు. కర్లపాలెంలో ఎరువుల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. రైతుల వేలిముద్రలు తీసుకుని ఎరువులు విక్రయాలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment