జననేత జన్మదినాన ఉప్పొంగిన అభిమానం
పట్నంబజారు: సంక్షేమ సారథి వందేళ్లు చల్లగా ఉండాలని వాడవాడలా ప్రజలు దీవించారు. రాష్ట్ర రాజకీయ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక అధ్యాయం సృష్టించుకున్న జననేత జన్మదినాన్ని పండుగలా నిర్వహించుకున్నారు. వైఎస్సార్ సీపీ అంటే.. సేవా కార్యక్రమాలకు ముందుంటుందని అభిమానులు చాటిచెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి.
గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ జన్మదినాన్ని వేడుకగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్, నగర అధ్యక్షుడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ నేత మేకతోటి దయాసాగర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన 162 మందిని అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
తాడికొండ నియోజకవర్గంలో...
తాడికొండలో వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ సమన్వయకర్త, గుంటూరు నగర అధ్యక్షుడు, డెప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్, రావిచెట్టు సెంటర్‌లలో కేకు కట్ చేసి, వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. తుళ్లూరు మండలం దొండపాడు వేడుకల్లో కేక్ కట్ చేసి, పేదలకు దుస్తులు, పండ్లు అందించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మేడికొండూరు మండల పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్‌లో డైమండ్ బాబు పాల్గొన్నారు. ఫిరంగిపురం నిర్మల్ హృదయ్ సేవాసంస్థలో జరిగిన వేడుకలకూ హాజరయ్యారు.
ఘనంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వాడవాడలా సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్‌లు పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment