క్రీ డా పోటీలతో మేలు
గుంటూరు రూరల్: ఉద్యోగులకు క్రీడా పోటీలతో ఎంతో మేలు ఉంటుందని ఏపీ అదనపు కేంద్రీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి. వీరభద్రస్వామి తెలిపారు. శనివారం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ డిగ్రీ పీజీ కళాశాలలో ఈపీఎఫ్‌వో సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఉద్యోగులకు రెండు దశాబ్దాలుగా ఇలాంటి క్రీడల పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ జోనల్ కార్యాలయం ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ శిఖర్‌శర్మ మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య పోటీలు వారి పని సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. గుంటూరు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ మాట్లాడుతూ ఆటలపోటీల నిర్వహణ సంతోషకరమన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్వించాలని కోరారు. విజ్ఞాన్ నిరుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాధిక, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనూరాధలు పీఎఫ్ కమిషనర్లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఉదయం ఏపీపై కర్నాటక, కేరళపై తమిళనాడు విజయం సాధించాయి. అనంతరం కర్నాటక, తమిళనాడు మధ్య జరిగిన పోటీలో కర్నాటక గెలిచింది ఆల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. కార్యక్రమంలో ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ 2 ఇంద్రనీల్‌ఘోష్, సహాయ కమిషనర్‌లు మాధవశంకర్, ఎ. విజయలక్ష్మి, ఆర్‌ఎస్‌పీబీ సభ్యుడు డీసీ రామారావు, రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, క్రీడా కార్యదర్శి కృష్ణార్జున, సాంస్కృతిక కార్యదర్శి సబీహాబేగం, సుప్రజ, వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విక్రయంలో విజయ్ డిజిటల్ మేటి
మంగళగిరి: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విక్రయంలో విజయ్ డిజిటల్ షోరూమ్ మేటి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాత బస్టాండ్ వద్ద షోరూమ్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. యజమానులు జువ్వాది గంగాధర రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment