గుంటూరు డీఆర్‌ఎంగా లిల్లీ పాండే
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర సాంస్కృతిక విభాగంలో డెప్యూటేషన్‌పై ఉన్న లిల్లీ పాండేను గుంటూరు డీఆర్‌ఎంగా నియమిస్తూ రైల్వే శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26న గుంటూరు డీఆర్‌ఎంగా రాయపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ మధుకర్‌ను నియమించిన రైల్వే శాఖ ఆ ఉత్తర్వులను తాజాగా రద్దు చేసి లిల్లీ పాండేను నియమించింది. ప్రస్తుత డీఆర్‌ఎం రామకృష్ణను ఎక్కడకు బదిలీ చేస్తారన్న విషయం ఆసక్తిగా మారింది.
బాల్య వివాహాలకు
వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాలలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆచార్య వి.దివ్యతేజోమూర్తి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా బాల్య వివాహ రహిత దేశంగా భారత్‌ను నిలిపే క్రమంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్కిటెక్చర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆచార్య కెవి నిరుపమ, అధ్యాపకులు డాక్టర్ షకీలా నూర్ బాషా, ఝాన్సీ, ఉషాకిరణ్, స్వప్న, చంద్రమోహన్, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
మంగళగిరి: ఎర్రచందనం వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని పలువురు వ్యాపారులు కోరారు. స్థానిక ఆటోనగర్‌లోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీశాఖ పీసీసీఎఫ్ చిరంజీవిచౌదరిని కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్.రవిరాజు, సెక్రటరీ నాగయ్య, జాయింట్ సెక్రటరీ కొండేటి ఆంజనేయులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ క్యాలెండర్
ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీతోపాటు గతేడాది కాలంలో విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో కూడిన జీవో పుస్తకాన్ని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం వారి కార్యాలయాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. ఉపాధ్యాయులందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా రూపొందించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, ఎండీ ఖాలీద్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు పి.నాగశివన్నారాయణ, పి.లక్ష్మీనారాయణ, కె.రమేష్, పి.పార్వతి, ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, జి.దాస్, సీహెచ్ లక్ష్మణ్‌కుమార్, కిషోర్, మూర్తి, శివరామకృష్ణ, బాలరాజు, కిరణ్, రమాదేవి, జయశ్రీ, కృష్ణారావు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆకర్షణీయంగా
వేంకటేశ్వరస్వామి నామాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో విజయకీలాద్రి పర్వతంపై ఏర్పాటు చేసిన వెంకటేశ్వరస్వామి నామాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణ పరిధితోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించేలా త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకులు రెండువైపులా నామాలతో వెంకటేశ్వరస్వామి నామాలు ఏర్పాటు చేశారు. ఈ నామాలు చుట్టుపక్కల ప్రజలకు కనిపించడంతో ప్రజలు భక్తితో తరించారు.
Comments
Please login to add a commentAdd a comment