పాఠశాలల అభివృద్ధిలో ఎస్‌ఎంసీల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల పాత్ర కీలకమని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త జి. విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం పాత బస్టాండ్ సెంటర్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఎస్‌ఎంసీ సభ్యులకు విధులు, బాధ్యతలపై శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీసీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎస్‌ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాలకు వచ్చే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యమైన విద్యాబోధనతోపాటు విద్యార్థుల ప్రగతిని నిరంతరం పరిశీలించాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో ఎంఈవోలు ఎస్‌ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్, జ్యోతికిరణ్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, ప్రధానోపాధ్యాయురాలు వసుంధర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment