లక్ష కార్డుల ఉద్యమానికి మద్దతు
కవి డాక్టర్ కత్తి పద్మారావు
పొన్నూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను ఆరో తరగతి నుంచి ఎంఏ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని చేపట్టిన లక్ష కార్డుల ఉద్యమానికి తెలుగు రచయితలు పలువురు మద్దతు ప్రకటించారని దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, కవి డాక్టర్ కత్తి పద్మారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే కె.శివాజీ, మాజీ ఎంపీ వి.వి. లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి ఆరవ జైపాల్, మాజీ డీఈఓ ఎ. జగదీష్, రచయిత గజేంద్రరావు తదితర రచయితలు, కవులు, సాహితీవేత్తలు, విమర్శకులు, మేధావులు, కళాకారులు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారన్నారు. ముఖ్యమంత్రికి పంపించే పోస్టు కార్డులపై వారు సంతకాలు చేశారని తెలిపారు. పాఠ్యాంశాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని కత్తి పద్మారావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment