కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల
నగరంపాలెం: గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం 264 మంది హాజరయ్యారు. అందులో 18 మంది ధ్రువపత్రాలను సమర్పించలేదు. మిగతా 246 మంది అభ్యర్థులకు శరీర కొలత పరీక్షలు నిర్వహించారు. వారిలో 31 మంది ఛాతీ, ఎత్తు కొలతలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. ఇక 215 మందికి 1600 మీటర్ల పరుగు పందెం పోటీలు జరగ్గా, 33 మందిని అనర్హులుగా ప్రకటించారు. 182 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 182 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీల్లో 68 మంది అర్హత సాధించగా, 114 మంది అనర్హత పొందారు. 182 మందికి లాంగ్ జంప్ చేపట్టగా 167 మంది అర్హత, 15 మంది అనర్హతకు చేరుకున్నారు. 246 మంది కానిస్టేబుళ్ల అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో 166 మంది అర్హత సాధించగా, 79 మంది అనర్హత పొందారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదే శాల మేరకు జిల్లా ఏఎస్పీలు కె.సుప్రజ (క్రైం), ఎ.హనుమంతు (ఏఆర్), పలువురు పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment