ఎస్సీ వర్గీకరణ వన్‌మెన్ కమిషన్‌కు భారీగా వినతులు
న్యాయం చేయండి
మేము ఎస్సీ ఉపకులంలో ఉన్నాం. ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు అందడం లేదు. ఫలితంగా తరతరాలుగా పేదరికంలో మగ్గుతున్నాం. కమిషన్ సమగ్ర విచారణ జరిపి మా కులానికి న్యాయం చేయాలి.
– వనం నాగేశ్వరరావు, ఆల్ ఇండియా బుడగజంగం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్
ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర
ప్రభుత్వాలు కుట్రపూరితంగా దళితుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ఇంతకాలం అందరూ అభివృద్ధి చెందాం, చెందుతున్నాం. ఇప్పుడు ఈ వర్గీకరణ నేపథ్యంలో మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న స్వార్ధ పరుల కుట్రను దళిత నాయకులు అందరూ గుర్తించాలి.
– ఈమని చంద్రశేఖర్, జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
గుంటూరు వెస్ట్/నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వన్‌మెన్ కమిషన్‌కు భారీగా వినతులు వచ్చాయి. వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన సుమారు 1200 మంది తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వన్‌మెన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ్, ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో అభిప్రాయాల సేకరణ జరిగింది. అధికంగా మాల సంఘాల నుంచి ఎక్కువ వినతులు వచ్చాయి. ఎస్సీ ఉపకులాల నుంచి కూడా దళిత నాయకులు వినతులు అందించారు. వినతుల స్వీకరణకు కలెక్టరేట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. కొందరు నాయకులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నాయకులు ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment