వైభవంగా శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలు
తెనాలి: స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీ రోడ్డులో జరుగుతున్న ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షామహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మంగళ శాసనాలతో శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 13వ తేదీ వరకూ జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి శరణాగతి మండపం వద్ద విశేష పూజలు చేశారు. గోదాదేవి 24వ పాశురాన్ని ద్రవిడ భాషలో స్తుతించారు. ఇదేరోజున నిర్వహించిన పుష్పయాగంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల పుష్పాలను తోడ్కొనివచ్చి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. భగవత్ రామానుజలను పూల పల్లకీపై అలంకరించి ఘనంగా ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థ, అన్న ప్రసాదాన్ని అందజేశారు. శ్రీనరేంద్ర రామానుజదాసస్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment