ఆర్వోబీకి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గడ్డిపాడు వద్ద ఇన్నర్ రింగు రోడ్డు ఆర్‌ఓబీకి కేంద్ర రైల్వే శాఖ ఆమోదం పలికింది. నిర్మాణానికి రూ.107.79 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డిపాడు వద్ద ఎల్‌సీ గేట్ నంబర్ 3 అతి పెద్ద రైల్వే గేటుగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా నాలుగు లేన్ల ఆర్వోబీ కోసం రైల్వే శాఖ గత ఏడాది నవంబర్ నెలలో ఉన్నతాధికారులకు ప్రణాళికలు పంపింది. ఇప్పటికే శంకర్‌విలాస్ ఆర్వోబీపై ట్రాఫిక్‌తో నగర వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్వోబీకి నిధులు మంజూరు చేయడం శుభపరిణామమని, దీని నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కొంత మేర నియంత్రించే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే ముందుగా రైల్వే జీఎం కార్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. పది రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారని పేర్కొంటున్నారు. ఆర్వోబీ కోసం స్థల సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది.
రూ.107.79 కోట్లు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment