ట్రామా నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ నారాయణరావు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ ట్రామా కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్(పర్యవేక్షణ అధికారి)గా ఆస్పత్రి ఆర్ధోపెడిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ వి.వి.నారాయణరావును నియమిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రమణ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి జీజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చే బాధితులకు సత్వర వైద్యం అందించేలా నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. రోజూ క్యాజువాలిటీకి వెళ్లి ట్రామా కేర్ సెంటర్ పనితీరును పర్యవేక్షించాల్సి ఉంది. ట్రామా చికిత్సకు వచ్చిన రోగులకు, బాధితులకు సత్వర వైద్యం అందుతోందా లేదా, డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ సమయపాలన పాటిస్తున్నారా లేదా వంటి పనులను చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment