జీజీహెచ్‌లో పలువురిపై చర్యలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చింతలపూడి నాగేశ్వరావుపై ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అనంతరం ఆస్పత్రిలోని పలువురు కార్యాలయ అధికారులు, కార్యాలయ సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ఉత్తర్వులు రావటంతో ఆస్పత్రి కార్యాలయ అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
ఫిర్యాదుతో విచారణ
2023లో గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చింతలపూడి నాగేశ్వరరావుపై గుంటూరుకు చెందిన డీఎస్‌బీ కోటేశ్వరరావు పలు ఆరోపణలు చేస్తూ లిఖితపూర్వకంగా డీఎంఈ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. డైట్ కాంట్రాక్ట్ ఫైల్ మాయం చేశారని, ముఖ్యంగా కరోనా డైట్ ఫైల్ మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రిక్రూట్‌మెంట్ నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎక్కువ మొత్తంలో చెల్లించారని, కొంత మందికి మాత్రమే ఇలా చెల్లించి మిగతావారిపై వివక్ష చూపించారని, నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై డీఎంఈ కార్యాలయం అధికారులు మూడుసార్లు ఇతర జిల్లాలకు చెందిన అధికారులను కమిటీగా నియమించి విచారణ చేయించారు. ఈ అధికారులు.. జీజీహెచ్‌కు వచ్చి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ చింతలపూడి నాగేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్స్ వై.లక్ష్మీ సామ్రాజ్యం, ఎ.గోపీనాథ్, జి.మనోరమ, ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావులను విచారించి డీఎంఈకి నివేదిక ఇచ్చారు. నివేదిక ప్రకారం డీఎంఈ కార్యాలయం తదుపరి చర్యలు తీసుకుంది. ఆ మేరకు గుంటూరు జీజీహెచ్ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆస్పత్రి అధికారులకు పలు సూచనలు చేసింది.
ఆస్పత్రి సిబ్బందిలో ఆందోళన
రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు
పాటించలేదని ఫిర్యాదులు
విచారణ చేసి చర్యలకు ఆదేశించిన డీఎంఈ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment